‘పెట్‌ ఫుడ్స్‌’లోకి గ్రోవెల్‌

‘పెట్‌ ఫుడ్స్‌’లోకి గ్రోవెల్‌

Team Carniwel
Celebrating Pet Parenting
https://carniwel.com/pages/about-us

Carniwel, where love, happiness, and togetherness come together to celebrate the extraordinary relationship between pets and their parents.

అక్వా ఫీడ్‌, అక్వా హెల్త్‌కేర్‌, సీఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో ఉన్న గ్రోవెల్‌ గ్రూపు ‘కార్నివెల్‌’ పేరుతో పెంపుడు జంతువుల ఆహార (పెట్‌ పుడ్‌) రంగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని సింగరాయపాలెం వద్ద ఉన్న తన అక్వా ఫీడ్‌ ప్లాంట్‌ దగ్గరే రూ.100 కోట్ల పెట్టుబడితో ప్రత్యేక ప్లాంటు ఏర్పాటు చేసింది. పెంపుడు కుక్కలు, పిల్లుల కోసం ప్రస్తుతం ఆరు రకాల పెట్‌ ఫుడ్స్‌ను మార్కెట్‌లో విడుదల చేసినట్టు గ్రోవెల్‌ పెట్‌ న్యూట్రిషన్‌ బిజినెస్‌ హెడ్‌ జేఎస్‌ రామకృష్ణ చెప్పారు. 2028 నాటికి ఈ మార్కెట్‌లో కనీసం ఎనిమిది శాతం వాటా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ప్రధాన పెట్‌ ఫుడ్‌ బ్రాండ్లతో పోలిస్తే తమ పెట్‌ ఫుడ్స్‌ ధర 50 శాతం తక్కువగా ఉంటుందన్నారు. ప్రజల ఆహార అలవాట్లను దృష్టిలో ఉంచుకుని తమ కంపెనీ పెట్‌ ఫుడ్స్‌ని కూడా వెజ్‌, నాన్‌-వెజ్‌ వేరియంట్లలో మార్కెట్‌లో విడుదల చేసినట్టు రామకృష్ణ తెలిపారు.

Read more on: Andhra Jyoti

Back to blog